శ్రీ స్కంద అనుగ్రహ హోమం, వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము, కళ్యాణము, హోమము జరిపించడం జరిగినది… శ్రీ సన్నిధి ఛానల్ నిర్వహణలో మాతృశ్రీ మన్నవ రాజరాజేశ్వరి దేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పీఠంలో శాస్త్రక్తంగా ఈ హోమం నిర్వహించడం జరిగినది.. ఈ వీడియోలో చెప్పినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ కథను విన్న వారికి ఆయురారోగ్యాలు, విద్యా ఉద్యోగాలు అభివృద్ధి, శీగ్ర కళ్యాణం, సంతాన ప్రాప్తి ఇలా మన మనసులో ఏది సంకల్పం చేసుకుంటే అది కచ్చితంగా జరిగి తీరుతుందని మన సనాతన ధర్మం తెలియజేస్తుంది.. కేవలం సుబ్రహ్మణ్య షష్టి రోజునే కాకుండా ప్రతి షష్టికి ఈ హోమం ని జరిపించుకున్న యువతీ యువకులకు వివాహంలోని ఆటంకాలు తొలగి వారు కోరుకున్న వారితో వివాహం జరుగుతుంది.. కన్నుల పండుగ జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరంతా కూడా తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు

No comment